వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మంత్రి బొత్స సత్య నారాయణ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెబుతున్నట్లు 175కి 175 సీట్లు కచ్చితంగా గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. చరిత్ర తిరగరాస్తామని, తమది అతి విశ్వాసం కాదని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, ఏపీ రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదని చెప్పారు.