టిడిపి అధినేత చంద్రబాబు స్వగృహంలో శుక్రవారం సీనియర్ నాయకులతో నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై దాదాపు గంటలు తరబడి చర్చించడం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మీరు పిల్లర్ లాంటివారని మీ సేవలు పార్టీకి అవసరమన్నారు. మీ నిర్ణయాలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. సంయమనం పాటించండి త్వరలో సరైన నిర్ణయం తీసుకుందాం. నియోజకవర్గంలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని సూచించారు.