నంబులపూలకుంట మండల కేంద్రంలోని నూతన హంగులతో తీర్చిదిద్దిన మండల ప్రజా పరిషత్ కార్యాలయంను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కార్యాలయాలన్నీ రెన్నవేషన్ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైకాపా పార్టీ నాయకులు పాల్గొన్నారు.