పలాస ఎల్ఐసి బ్రాంచ్ ఆవరణంలో శుక్రవారం జీవిత బీమా ఏజెంట్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఆల్ ఇండియా ఏజెంట్ల జే ఏ సీ ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం, ఐ ఆర్ డి ఎ జీవిత బీమా సంస్థని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారనీ, వారు తీసుకున్న తప్పుడు విధానాల వలన ఇటు పాలసీ హోల్డర్స్, అటు 15 లక్షలు ఏజెంట్లు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఐ ఆర్డి ఏ తమ విధానాలను మార్చుకొని మునుపటి మాదిరిగా జీవిత బీమా సంస్థని కొనసాగించాలని ఆల్ ఇండియా ఏజెంట్ల జే ఏ సీ కోరింది. ఈ కార్యక్రమానికి బ్రాంచ్ ప్రెసిడెంట్ జనగ రాజేంద్రనాయుడు, సెక్రెటరీ ఎస్ నాగేశ్వరరావు, ట్రెజరర్ బి వాసుదేవ్, సీనియర్ ఏజెంట్లు వజ్జ ఈశ్వరరావు, డోకి మోహన్ రావు, బీ రుక్మానందరావు, టి శేఖర్ బాబు పి నరసింహులు, బి కూర్మారావు, ఏజెంట్లు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa