పాతపట్నంలో టిడిపి వారు చేస్తున్న దీక్ష పై పాతపట్నం మండల వైయస్సార్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై, అదేవిధంగా పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి పై వ్యక్తిగత దూషణలు చేస్తూ పాతపట్నం మెయిన్ రోడ్డుపై మైకులు పెట్టి అరుస్తున్న టిడిపి నాయకులు పై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసులకు మండల వైఎస్ఆర్ పార్టీ కోరింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఏఎంసీ చైర్మన్ కొండల అర్జునరావు , కోదూరు సర్పంచ్ పనుకు మోహన్, తిట్టిమి సర్పంచ్ ప్రతినిధి తూలుగు ప్రవీణ్, తిట్టిమి ఎంపిటిసి కొప్పల గీత, బూరగం సర్పంచ్ ప్రహ్లాదపులై, బోరుభద్ర సర్పంచ్ సవిరిగాన శ్రీను, పి ఎల్ పురం సర్పంచ్ ఆనెము ఉమమహేశ్వరరావు , గిరిజన నాయకుడు కోదురు అప్పన్న, మండల పార్టీ కార్యదర్శి గోకవలస రాము తోపాటు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa