ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీని యథావిధిగా మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జీవో నంబర్ 662 పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో ప్రస్తుత మద్యం పాలసీ 2023 సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఇప్పటికీ 2,934 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటి సంఖ్య ఏ మాత్రం తగ్గించకుండానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa