కీలకమైన టెట్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇప్పుడు ఏపీలో చర్చనీయంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీలో ఇటీవలే నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దాదాపుగా 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా... 58.07 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించిన కారణంగా నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించి ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ పరీక్షా ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఫలితాల్లో పలువురు అభ్యర్థులకు గరిష్ఠం కంటే అధికంగా మార్కులు వచ్చాయి. దీంతో ఫలితాలపై గందరగోళం నెలకొంది. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పరీక్షలో అవలంబించిన నార్మలైజేషన్ పధ్ధతి వల్లే ఈ పొరపాటు జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa