ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా అనందుకు సారీ..ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా

national |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 09:59 PM

తాను చేసిన కండోమ్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా క్షమాపణలు చెప్పారు. తాను ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆ వర్క్ షాప్ లో ఏ ఒక్క అమ్మాయి అయినా నా వ్యాఖ్యల పట్ల నొచ్చుకుని ఉంటే అందుకు చింతిస్తున్నానని హర్జోత్ కౌర్ బమ్రా పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీలతో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను పత్రికల్లో మరో కోణంలో ప్రచురించారని ఆమె ఆరోపించారు.


ఇదిలావుంటే బీహార్ లో విద్యార్థినులతో ఓ వర్క్ షాప్ సందర్భంగా ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కండోమ్ లు కూడా కావాలంటారేమో అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనపై తీవ్ర విమర్శలు రావడంతో సదరు ఐఏఎస్ అధికారిణి స్పందించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com