శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని పాల్గొన్నారు. ఇద్దరూ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామలా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా నిర్వహించే ఏకాదశ దివ్య హారతులను వీక్షించారు. అనంతరం దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ దంపతులు కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.