సుబాబుల్ పంట కొనుగోళ్ళలో కూడా రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలిపారు. వివక్ష లేకండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలి అంటూ సిఎం జగన్ రెడ్డి కి లేఖ రాసారు. అసలే మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండగా, వచ్చిన పంటను విక్రయించాలంటే అధికార పార్టీ నేతలకో, లేక వారు సూచించిన దళారులకే అమ్మాలని హుకుం జారీ చేయడం అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. సుబాబుల్ పంట కొనుగోలు విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వివక్ష లేకండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలి. పోలీసుల బెదిరింపులను నియంత్రించాలి. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని లేఖ ద్వారా సీఎం జగన్ కి తెలియజేసారు.