అధికారం మారినప్పుడల్లా పార్టీలు, పేర్లు మార్చుతూ పోతే దేశంలోని, ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, మెడికల్ బోర్డు లు తమ సర్టిఫికెట్స్ ను గుర్తించవు అని, సాధారణంగా 3 నుండి 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు అందరూ మరియూ ప్రస్తుత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని, ఇటువంటి చర్యల వల్ల వేలాది మంది వైద్యుల భవిష్యత్ ఆగమ్యగోచరం అవుతుంది అని.. కావున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును యధాతధంగా కొనసాగించడం మేలు అని వైద్యులు డా. శ్రీ రఘురామ్ తెలియజేసారు.