రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక, సత్య కుమార్ లాంటి వారు చేస్తున్న అసత్య, అసందర్భ పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనించాలి అని మంత్రి జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి ప్రజలు సరైన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎజెండాతో సత్యకుమార్ అసత్యాలను, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదచల్లాలని చూస్తున్నాడని మండిపడ్డారు. మరొకసారి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నేత సత్యకుమార్‌ను జోగి రమేష్ హెచ్చరించారు.