కురుపాం నియోజక వర్గంలో గరుగుబిల్లి మండలంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో మాజీ మంత్రి పాములా పుష్ప శ్రీవాణి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మొత్తం గరుగుబిల్లి మండలంలో 3956 మంది 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తున్న వైఎస్ఆర్ చేయూత మూడవ విడత 18,750/- రూపాయలు చొప్పున మొత్తం 7.42 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అని తెలియజేసారు.