విజయవాడలో జరిగిన చేయూత కార్యక్రమంలో వైసిపి నేతల అబద్ధాలు వినలేక మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను మంత్రి జోగి రమేష్ బెదిరించారు అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలిపారు. అలానే తిరిగి వచ్చి కూర్చొని మీటింగ్ లో చెప్పేది వినకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరించడం దారుణమైన విషయం అని అన్నారు. అసలే రాష్ట్రంలో రక్షణ లేదని ఆందోళన చెందుతున్న మహిళలని ఏకంగా మంత్రులే బెదిరించడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది అని లోకేష్ అభిప్రాయపడ్డారు.