ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో 97 వేల గృహాలు మంజూరు చేసాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 11:48 AM

ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్యత నిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కృష్ణా  జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు .  జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో తహశీల్దార్లు ,ఎం . పి . డి . వో . లు , హౌసింగ్ , పంచాయతీ రాజ్ , ఆర్ . డబ్ల్యూ . ఎస్ . అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించారు .  గృహ నిర్మాణంపై కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో 97 వేల గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు .   లే - అవుట్లలో కల్పించవలసిన మేరక , మౌలిక వసతులు సంబంధించి జిల్లాలో 72 కోట్లతో నామినేషన్ పద్ధతిలో 215 పనులు మంజూరు చేశామని ఇవన్నీ అక్టోబర్ ఆఖరి నాటికీ పూర్తి కావాలన్నారు . జిల్లాలో రీ - సర్వే కలెక్టర్ సమీక్షిస్తూ మొదటి దశలో జిల్లాలో 17 గ్రామాల్లో చేపట్టి పూర్తిచేయడం జరిగిందన్నారు . ప్రస్తుతం చేపట్టిన రీ - సర్వే వందేళ్ళ వరకు అమల్లో ఉండవచ్చని కావున తహశీల్దార్లు రీ - సర్వే పనుల్లో అప్రమత్తంగా ఉండాలని , ఖచ్చితమైన సమాచారం పంపాలని అన్నారు . గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై దృష్ఠి సారించాలన్నారు . అక్టోబర్ 5లోగా గుర్తించిన పనులన్నీ మంజూరు చేయాలని , అక్టోబర్ నెలఖరులోగా గ్రౌండ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డిగారు ఆదేశించనట్లు తెలిపారు . ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గారు , పంచాయతీరాజ్ ఎస్ . ఈ . ఈరాస్వామి గారు , డ్వామా పీ . డీ  . జీ . వి . సూర్యనారాయణగారు , హౌసింగ్ పీ . డీ . శ్రీధర్ గారు , అర్ . డీ . ఓ . లు , మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com