ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి తొలి దళిత స్పీకర్ గా ఎంచబడి , పని చేసిన వ్యక్తి G.M.C బాలయోగి. ఇతని ప్రతిభ చూసి తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయన జయంతి వేడుకగా ... నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమైన సేవలందించిన తెలుగుదేశం నేత, తొలి దళిత స్పీకర్ గా దేశ రాజకీయాలలో ధ్రువతారగా వెలిగిన కీ.శే. గంటి మోహన చంద్ర బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ దళితాభ్యుదయవాది స్మృతికి నివాళులు. బాలయోగి గారి స్పూర్తితో ఎస్సీల అభివృద్ధికి పునరంకితమవుదాం అని తెలియజేసారు.