కందుకూరు మండలంలో శనివారం వాన దంచి కొడుతుంది. మండలం వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి విడతల వారీగా వర్షం కురుస్తూనే ఉంది. అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతిభారీస్థాయి వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయి. విపరీతమైన వర్షాల వల్ల కందుకూరు పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థం అయిపోయింది. పలు ప్రాంతాల్లో వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు.