బాపట్ల జిల్లా రవాణాశాఖ అధికారులు పర్చూరులో శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని, ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలకు నాలుగున్నర లక్షల రూపాయల మేర జరిమానా విధించారు. ఇందులో ఒక లారీకి మూడు లక్షల ఎనభై వేల జరిమానా వేయడం విశేషం. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అంకమ్మ రావు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన వాహనాల వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇకపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.