28 ఏళ్లకే ఓ వ్యక్తి 24 పెళ్లిళ్లు చేసుకున్న ఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది. అసబుల్ మొల్లా అనే వ్యక్తి సాగర్దిగీ ప్రాంత మహిళను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు పారిపోయాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి నిర్వాకం బయటపడింది. నకిలీ గుర్తింపు కార్డులతో బిహార్, పశ్చిమ బెంగాల్లో పేర్లు మార్చుకుంటూ 28 ఏళ్ల వయసులో 24 పెళ్లిల్లు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.