కూరలో ఉప్పు తక్కువైందని భార్యను భర్త హత్య చేసిన ఘటన బీహార్లోని సారన్ జిల్లాలో చోటుచేసుకుంది. కలాన్ గ్రామానికి చెందిన ప్రభురాం భార్య వంట చేసే సమయంలో పొరపాటున కూరలో ఉప్పు కొద్దిగా తక్కువ వేసింది. దీంతో భోజనం చేస్తున్న ప్రభురామ్ ఉప్పు తక్కువైందని భార్యపై కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు స్థానికుల సమాచారంతో ప్రభురామ్ ను అరెస్ట్ చేశారు.