సఫాయి మిత్ర సురక్షిత సహార్ విషయంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు దక్కింది. న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలం సురేష్ , పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ శనివారం అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి , తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష , కమిషనర్ అనుపమ అంజలి , డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు.