భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఉద్యమంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పాత్ర ఎంతో ప్రాధాన్యత కలదని ఆయనను ఆదర్శంగా తీసుకుని యువకులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు క్రీడలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఉదయం గాంధీ జయంతి సందర్భంగా శాసనసభ్యులు ఆయనకు నివాళులు అర్పించి గాంధీ సర్కిల్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఏర్పాటుచేసిన 2కే రన్ ను ప్రారంభించారు.
మొదట శాసనసభ్యులు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి, ఏపీ స్పోర్ట్స్ యాప్ ను ఆవిష్కరించారు. అనంతరం 2కే రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక వికాసం తో పాటు ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలమని యువకులలో క్రీడల పట్ల స్ఫూర్తిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి లతోపాటు ఎన్ వై కే స్టేట్ డైరెక్టర్ విజయరావ్, జిల్లా ఎన్ వై కె యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్, బాబు రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలాజీ ఇతర కోచ్ లు క్రీడాభిమానులు పాల్గొన్నారు.