ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, కమీషనర్ వెంకటరమణయ్య, ప్రొద్దుటూరు అర్బన్, రూరల్, రాజుపాలెం మండల సీడీపీఓ, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.