హైదరాబాదులో అయ్యన్న కుటుంబ సభ్యుల మీద పోలీసులు చేసిన దౌర్జన్యంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. బిసి నేత అయ్యన్నపాత్రుడు. కుటుంబంపై జగన్ రెడ్డి ప్రభుత్వం మొదటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారని అన్నారు. ఐదేళ్ల లోపు వయసుగల పిల్లలను భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని అన్నారు.