ద్విచక్ర వాహనం చోరీపై ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహారాజు తెలిపారు. ఆయన కథనం మేరకు కట్టమంచికు చెందిన పిజెఆర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న పాండురంగ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని కాంప్లెక్స్ లో పార్కింగ్ చేసి మరుసటి రోజు ఉదయం చూడగా కనిపించకపోవడంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.