నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం ఉదయం 6: 30 నిమిషాలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పద్మనాయక వెలమ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో అన్ని కులాలకు సమానంగా గౌరవం లభిస్తుందని అన్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పద్మనాయక వెలమ సంఘం భవనానికి శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. అచ్చంపేట పట్టణంలో కేటాయించిన ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మనాయక వెలమ సంఘం అచ్చంపేట ప్రతినిధులు పాల్గొన్నారు.