గుంటూరు: కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కర్రె హర్షవర్ధన్ (21) తన స్నేహితులతో కలసి కొల్లిపర సమీపంలో కృష్ణానదిని చూడడానికి వెళ్ళాడు. నదిలోకి దిగి హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు కాలు జారీ నదిలోకి కొట్టుకుపోయాడు. వెంటనే ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్నేహితులు కొల్లిపర పోలీస్ స్టేషన్ లో తెలియజేశారు. వెంటనే ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని హర్షవర్ధన్ కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. హర్షవర్ధన్ ఆచూకీ ఇంకా తెలియలేదని ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు.