రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ దేశం తగ్గేదేలే అన్నట్లు పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టింది. ఈ తాలూకా ఆధారాలు కొన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలలుగా యుద్ధం చేస్తున్న మాస్కో సైన్యం ఇజియం నగరాన్ని చిత్రహింసలకు కేంద్రంగా మార్చుకుంది. ఇజియం నగరంలో ఉక్రెయిన్ సైనికులు, పౌరులను రష్యా సేనలు చిత్రహింసలకు గురిచేసిన పదిప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజియం నగరంలో ఉన్న పది చిత్రహింస కేంద్రాలను అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ సందర్శించింది. డార్క్ రూంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం. అక్కడనుంచి తప్పించుకున్న 15 మంది ఉక్రెయిన్ సైనికులు తాము అనుభవించిన నరకాన్ని మీడియాతో వెల్లబోసుకున్నారు. చిత్రహింసలకు తాళలేక ఎనిమిది మంది అక్కడే చనిపోయినట్లు చెప్పారు. అందులో ఒకరు పౌరుడని బాధిత కుటుంబాలు తెలిపారు.