ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌కు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 10:04 PM

టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వెన్నునొప్పి కారణంగా బుమ్రా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. బుమ్రా గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించి నివేదిక సమర్పించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బుమ్రా లేకపోవడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa