గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదరలోని దర్జీపురా వద్ద ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు.