మూడు రాజధానులకి మద్దతుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామీ ఆలయంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరి కాయలు కొట్టి మండపం చుట్టూ మోకాళ్ళ ప్రదక్షణ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వికెందరీకరణ చేపట్టారన్నారు. ఉత్తరాంధ్ర కు అన్యాయం చేయాలనీ టిడిపి నాయకులు జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. మూడు రాజధాను లకి తమంతా మద్దతు ఇస్తున్నామన్నారు. జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలుస్తామన్నారు. టిడిపి నాయకులు విశాఖపట్నం ణి పరిపాలన్ రాజధాని చేయడం పై తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లొ జెడ్ పిటిసి కాసులమ్మ మండల పార్టీ అధ్యక్షులు వెలగ ఈశ్వర్ రావు పి ఏ సి ఎస్ అధ్యక్షులు అయినంపూడి మణి రాజు సర్పంచ్ లు సురేష్ వర్మ తాళ్ల భార్గవ్ రత్నకుమారి వెదుళ్ల రమణ శంకర్ రావు నాయకులు రోకల్లా శ్రీనివాస్ కొప్పిశెట్టి హరిబాబు వెంకటేశ్ రావు అల్లాడి కొండ బంగార్రాజు సిద్దబాత్తులా కృష్ణ లక్షణారావు ఏజ్జల అప్పలరాజు పాల్గొన్నారు