సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సమావేశంలో ఇరువురూ పలు విషయాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు చెపుతున్నారు. మరోవైపు చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి అభినందనలు తెలిపేందుకు గంటా శ్రీనివాసరావు వచ్చినట్టు ఆయన అనుచరులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భేటీకి సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa