ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి సేవలకు ఆరెస్సెస్ సేవారత్న అవార్డులు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 11:15 PM

ఆరెస్సెస్ పలువురు ప్రముఖులకు సేవారత్న అవార్డులను ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ఏపీకి చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ లకు సేవారత్న పురస్కారాలను ఆరెస్సెస్ అందజేసింది. సమాజానికి వారు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందించింది. మరో 24 మంది వ్యక్తులు, సంస్థలకు కూడా అవార్డులను అందజేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ లెప్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్) చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ప్రకటనలో ఆరెస్సెస్ తెలిపింది. తమ దాతృత్వంలో సమాజానికి నిస్వార్థంగా వెలకట్టలేని సేవలందించిన వారిని ఈ పురస్కారాలను అందిస్తున్నట్టు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa