గుజరాత్‌లోని నవ్సారి జిల్లా ఖేర్గామ్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్‌పై గూండాలు దాడి చేశారు. నవ్సారి జిల్లా పంచాయతీ అధ్యక్షుడు భిఖుభాయ్ అహిర్ ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే పటేల్ ఆరోపించారు. గూండాలు కులం పేరుతో దూషించారని, అంతటితో ఆగకుండా రక్తం కారేలా కొట్టారని అన్నారు. "నువ్వు ఆదివాసీగా నాయకుడిగా మారుతున్నావు. ఇక్కడ ఆదివాసీలను ఎదగనివ్వము" అని బెదిరించనట్లు చెప్పారు.