మనకు తెలిసినంత వరకు ఏ, బీ, ఏబీ, ఓ అనే బ్లడ్ గ్రూపులు పాజిటివ్, నెగటివ్ రకాలు ఉంటాయని తెలుసు. ఇవి కాకుండా మరో కొత్త బ్లడ్ గ్రూపును యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. దానికి 'ఈఆర్' అని పేరు పెట్టారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న మిస్టరీని చేధించారు. ఈ బ్లడ్ గ్రూపును సులువుగా కనుగొనే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.