ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ములాయం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఆయనకు కీలకమైన మందులు వాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం.. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు.