అమరావతి రైతుల పాదయాత్రకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో నేడు మహా పాదయాత్ర కొనసాగుతుండగా, నందమూరి రామకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. నందమూరి రామకృష్ణ పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా మూడు గంటల పాటు పాదయాత్ర చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులతో కలిసి నడిచారు.