నేను రాజీనామా చేశా. టీడీపీ నేత అచ్చెన్నాయుడు నువ్వు కూడా రాజీనామా చేయ్యు అంటూ వైఎస్సార్సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం అనకాపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని, వికేంంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నేను రాజీనామా చేశా. ఇంకా మావాళ్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నా చాలెంజ్‌ను స్వీకరించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని. అని ధర్మశ్రీ డిమాండ్ చేశారు.