లోన్ యాప్స్ వేధింపులను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోన్ యాప్‌ల నుంచి వేధింపులు ఎదురైతే బాధితులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 1930ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై సోమవారం ఏపీ హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బాధితులంతా టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించింది.