ఆరు నెలలోపు అక్రమ మైనింగ్ కేసులోవున్న గాలి జనార్దన్ రెడ్డి విచారణను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ నిబంధనలు సడలించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాదు సీబీఐ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇకనుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇదిలావుంటే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa