డ్రోన్లు ఎగిరితే..అందులోనూ ఓ ప్రఖ్యాత ఆలయం చూట్టూ తిరిగితే కాస్త ఆలోచించాల్సిన అంశమే. ఇదిలావుంటే ఏపీలో ప్రముఖ శైవక్షేత్రంగా అలరారుతున్న మహానంది ఆలయంపై డ్రోన్ కలకలం రేగింది. నంద్యాల సమీపంలోని ఈ ఆలయంపై ఓ డ్రోన్ సంచరించడాన్ని గుర్తించారు. డ్రోన్ ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరిస్తుండగా ఆలయ వర్గాలు గమనించాయి. డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించిన సిబ్బంది, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతడి వాహనాన్ని కారులో వెంటాడారు. ఆరు కిలోమీటర్ల వరకు ఈ చేజింగ్ సాగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు అతడిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. డ్రోన్ ఆపరేటర్ వాహనాన్ని వారు సరిగా గుర్తించలేకపోయారు. దాంతో అతడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే సీసీ ఫుటేజిలో డ్రోన్ ఆపరేటర్ దృశ్యాలు కనిపించకపోవడంతో, పోలీసులు ఇతర మార్గాల్లో దర్యాప్తు షురూ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa