బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పాపీడనం వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా ముసురు అలుముకుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు వేర్వేరు ప్రాంతాలలో కురుస్తుండటoతో ముసరు వాతావరణం కొనసాగుతోoది. ఆది, సోమవారాల్లో పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని వివిధ మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.