గుంటూరు పట్టణంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో సోమవారం విద్యార్థిని అదృశ్యమైనట్లు కేసు నమోదయింది. స్థానిక మల్లికార్జునపేటకు చెందిన విద్యార్థిని జూనియర్ ఇంటర్ చదువుతుంది. సోమవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కుమార్తె ఆచూకీ నిమిత్తం తండ్రి పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.