పల్నాడు జిల్లా అభివృద్ధిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ శివశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నరసరావుపేటలోని కలెక్టరేట్ లో అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా అభివృద్ధిలో మీతోడ్పాటు అనే కార్యక్రమం పై చర్చించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజల జీవన విధానానికి అనుగుణంగా అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు.