జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు నగరంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, వలంటీర్లతో సమావేశమవుతారు. 16న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. మూడు రోజులు కూడా జిల్లాల నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.