గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం రైల్వే కోడూరు మండలం గంగరాజు పోడు సచివాలయ పరిధిలోని సూరపరాజు పల్లి గ్రామంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, శివరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, శివ శంకర్ రాజు, తాసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో నాగార్జున, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.