తెలుగు దేశం పార్టి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును సోమవారం సాయంత్రం విజయవాడలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రీయ బ్రాహ్మణ ప్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాధ్ శర్మ కలిసినారు. అచ్చెన్నాయుడుకు శాలువా కప్పి సన్మానించారు. సోమవారం సాయంత్రం అచ్చెన్నాయుడుతో సుమారు గంటసేపు సాయినాథ శర్మ చర్చించారు. సుదీర్ఘ చర్చలలో పలు అంశాలను చర్చించినట్లు సాయినాథ్ శర్మ పేర్కొన్నారు. ఇటీవల సాయినాథ శర్మను రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పదవి నుంచి తప్పించడం జరిగింది. వెంటనే సాయినాథ శర్మకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన పిలుపుమేరకు సోమవారం సాయినాథ్ శర్మ అచ్చెన్నాయుడును కలిశారు. సాయినాథ శర్మకు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు విషయం తెలిసింది.
ప్రస్తుతం పార్టీ కోసం వర్గాల భేదాభిప్రాయం లేకుండా కృషి చేయాలని అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కోసం నిరంతరం ప్రజలల్లో పని చేస్తున్న మీకు పార్టీలో ఉన్నతి స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు సాయివర్గంతో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందరూ కలిసి కట్టుగా, ఐక్యతతో పార్టీ విజయాన్నికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైషమ్యాలు వీడి పార్టీ గెలుపే ద్యేయంగా కృషి చేయాలని అచ్చెన్నాయుడు సూచించినట్లుగా తెలిసింది. సాయి నాథ్ శర్మ తో పాటు రాష్ట్రీయ బ్రాహ్మణ ప్రంట్ ప్రదాన కార్యదర్శి అప్పాజీ ప్రవీణ్, విజయవాడ మాజీ కార్పొరేటర్ దండూరు మహేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కుసుమ కుమారి, ఇటుకలపాటు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.