బ్యాంకు సిబ్బంది అంటూ సైబర్ నేరగాళ్లు ఫోను చేసి రూ. 23, 841 నగదును కాజేసిన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. బీవీ నగర్ ప్రాంతానికి చెందిన ఎం. కె. శశికళ ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. యోనో ఖాతా సస్పెండ్ అయ్యిందని, లింకు ద్వారా దాన్ని ఓపెన్ చేసి పునరుద్ధరించుకోవాలని బ్యాంకు నుంచి అంటూ ఫోను వచ్చింది. దాంతో ఆమె లింకును ఓపెన్ చేయడంతో నగదు మాయమైంది.