రిజర్వ్ బ్యాంకులో జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరవుతూ రుణాలు సేకరిస్తున్న ఏపీ సర్కారు ఈ మంగళవారం కూడా సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైంది. ఈ దఫా రూ.500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం పొందింది. 18 ఏళ్ల కాలానికి 7.85 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని తీసుకుంది. తాజా రుణంతో ఈ ఆర్థిక ఏడాదిలో అప్పు రూ.52,108 కోట్ల రుణానికి చేరింది.