ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం జేఏసీ మరియు శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ గర్జన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ని ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు గా ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవం ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతీ ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా విద్యావేత్తలు, వర్తక సంఘాలు , స్వచ్చంధ సంస్థలు, అన్ని విభాగాలు వారు విశాఖ గర్జన లో పాల్గొని విజయ వంతం చేసి ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని యావత్తు దేశానికే తెలియజేయాలని ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అలాంటి ఉత్తరాంద్ర కు ఖచ్చితంగా అభివృద్ధి అనేది అవసరం ఉత్తరాంధ్ర లో ఉన్న వారికి రాజదాని అవసరం ఖచ్చితంగా అవసరమైన ఉన్నదనే విషయం గ్రహించాలని అందుకు గానూ ఈ నెల 15 వ తేది శనివారం నాడు జరగబోయే విశాఖ గర్జన కు వాడ వాడల నుండి ప్రతీ ఒక్కరూ వచ్చి మన విశాఖ వాసుల గళం వినిపించాలని కోరారు.
అనంతరం బాలరాజు మాట్లాడుతూ వికేంద్రీకరణ వలనే పరిపాలనా సౌలభ్యం జరుగుతుందని మన భావి తరాల భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని రాష్ట్ర విభజన వలన జరిగిన పరిస్థితులు మరల భవిష్యత్తు తరాలకు పునరావృతం కాకుండా ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారు ఆయనకు మనము అందరూ తోడు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ జేఏసి సమావేశం లో నియోజకవర్గం లో వార్డు కార్పోరేటర్ లు, వార్డు ఇంచార్జ్ లు , వార్డు ప్రెసిడెంట్ లు, మూడు మండలాల యంపిపి లు జెడ్పిటిసి లు, వైస్ యంపిపి సర్పంచ్ లు , యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు అభిమానులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారు, ఉద్యోగులు, వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థలు అధినేతలు, మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు